పలాస మినీ స్టేడియం పనులు త్వరగా పూర్తిచేయాలి.


 పలాస మినీ స్టేడియం పనులు త్వరగా పూర్తిచేయాలి.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినేని.

పలాస, ఆగస్టు 18:

 పలాస నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పలాసలో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శాప్ చైర్మన్ రవి నాయుడును కోరారు.

2019లో ప్రారంభమైన మినీ స్టేడియం నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై శాప్ చైర్మన్‌తో ఎమ్మెల్యే చర్చించారు. స్టేడియం నిర్మాణం పూర్తయితే పలాస ప్రాంతంలోని క్రీడాకారులు, యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతం చేసేందుకు శాప్ ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేసి, నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని రవి నాయుడును ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. పలాస ప్రాంతంలో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించడంతో పాటు యువతకు మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post