కేరళలో యూడీఎఫ్ ఘన విజయం: మార్కాపురంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.


 కేరళలో యూడీఎఫ్ ఘన విజయం: మార్కాపురంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పది సంవత్సరాల తర్వాత యుడిఎఫ్ కూటమి 2/3 వంతు మెజార్టీతో ఘన విజయం సాధించడం పట్ల మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం గడియార స్తంభం ఆవరణలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ, "కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ సోదరభావం పెంపొందుతుంది. అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. రాజ్యాంగబద్ధ పాలన అందుతుంది. అన్ని మతాల వారికి, అన్ని భాషల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమాన హక్కులు లభిస్తాయి. అందరినీ కలుపుకొని వెళ్లే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే" అని అన్నారు 

మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ జనరల్ సెక్రెటరీ షేక్ అబ్దుల్లా, మార్కాపురం నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్, మార్కాపురం నియోజకవర్గ కేకేసీ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్, మార్కాపురం పట్టణ కేకేసీ అధ్యక్షులు షేక్ నాగూర్ భాష, కాంగ్రెస్ నాయకులు సామెల్, షేక్ మహబూబ్ సుభాని మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post