పలాసలో రేపు వైసీపీ కృతజ్ఞతా సమావేశం.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినేని.
శ్రీకాకుళం,పలాస, ఆగస్టు 28:
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఆయన కుమారుడి అరెస్టు నేపథ్యంలో అండగా నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వైసీపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు తెలిపారు.
ఈ సమావేశం ఆగస్టు 29న శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పలాస పట్టణంలోని ప్రగతి భవన్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలతో పాటు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
